Current Date: 20 Mar, 2025

పరకామణిలో టీటీడీ ఉద్యోగి చేతివాటం...

చెన్నై శ్రీవారి ఆలయంలో టీటీడీ ఉద్యోగే చేతివాటం ప్రదర్శించాడు. దాదాపు రూ.6.74 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ నోట్లను మాయం చేసినట్టు అధికారులు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో పనిచేస్తున్న కృష్ణకుమార్‌ చెన్నై శ్రీవారి ఆలయం, సమాచార కేంద్రం సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. గతేడాది అక్టోబరు 6వ తేదీన జరిగిన పరకామణి రిజిస్టర్‌లో కాలం సమస్య ఉందనే కారణంతో 950 విదేశీ కరెన్సీ నోట్లను నమోదు చేయలేదు. తిరిగి తర్వాత పరకామణి లెక్కింపు సమయంలో తిరిగి విదేశీ కరెన్సీ నోట్ల సంఖ్యను నమోదు చేశారు. అయితే గత పరకామణి లెక్కింపు జాబితాను, తాజా జాబితాను పోల్చిచూసినప్పుడు తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నిజానికి 950 నోట్లలో అఽధిక విలువైన డాలర్‌ నోట్లను మార్పిడి చేసి తక్కువ డాలర్‌ నోట్లను ఆస్థానంలో చేర్చినట్టు విజిలెన్స్‌ విచారణలో తేలింది.

Share