ఈరోజు నుంచి ఐపీఎల్ 2025 సీజన్ మొదలుకాబోతోంది. మొత్తం 65 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడా సంగ్రామం శనివారం రాత్రి డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ప్రారంభంకానుంది. 2008 తర్వాత ఇరు జట్ల మధ్య సీజన్ తొలి మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి.లీగ్ దశలో 69 మ్యాచ్‌లు జరగనుండగా.. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించనున్నాయి. ఆ తర్వాత మే 25న ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. గత మూడు సీజన్ల తరహాలోనే ఇప్పుడు కూడా 10 జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐపీఎల్ 2025 ఆరంభోత్సవంలో శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్‌లా, దిశా పటాని ఆట పాటలతో అలరించబోతున్నారు. 2008 నుంచి నిర్విరామంగా ఐపీఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ టోర్నీ ఇదే కావడం విశేషం.
Share