Current Date: 24 Mar, 2025

బెట్టింగ్ యాప్స్ కేసుపై నోరుజారి.. క్షమాపణలు చెప్పిన హీరోయిన్

ఏపీ, తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులు ఇప్పుడు సెలెబ్రిటీలకి చుక్కలు చూపిస్తున్నాయి.ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న తెలుగు హీరోయిన్ పేరు అనన్య నాగల్ల. ఆమె అరెస్ట్ తప్పదనే వార్తలు రావడంతో.. ఎట్టకేలకు ఈ హీరోయిన్ స్పందించింది. ‘‘బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని మాకు ఇప్పుడే తెలిసింది. బాలీవుడ్‌లో పెద్ద స్టార్లు, క్రికెటర్లు కూడా ఇలాంటివి ప్రచారం చేశారు కదా, వాళ్ళు అన్నీ తెలుసుకునే చేస్తారని అనుకున్నాం. హైదరాబాద్ మెట్రోలో కూడా ఇలాంటి ప్రకటనలు కనిపిస్తే, అది చట్టవిరుద్ధమని మాకు ఎలా తెలుస్తుంది?’’ అని అనన్య ప్రశ్నించింది. పోలీసులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు అనన్యతో సహా పలువురు సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అనన్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆమె వెంటనే క్షమాపణ చెప్పింది.

Share