Current Date: 24 Mar, 2025

వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

వన్యప్రాణుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పులుల సంరక్షణ అంటే కేవలం పులుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని.. వన్యప్రాణులు, స్థానిక సమాజాలకు ప్రయోజనం చేకూర్చే సామరస్యపూర్వక పర్యావరణ వ్యవస్థను నిర్వహించడమని చెప్పారు. పులులపై వార్షిక నివేదికను విడుదల చేసి, నగరవనం లోగోను పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా 50 నగరవనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 2024-25 సంవత్సరానికి మరో 11 నగరవనాలు మంజూరు చేయబడ్డాయని అన్నారు. పిఠాపురంలో ఒక నగరవనం కూడా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. వన్యప్రాణులను రక్షించడానికి, పర్యావరణ సమతుల్యతను నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, క్షేత్ర సిబ్బంది, పరిరక్షకులు నిబద్ధతతో పని చేస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Share