Current Date: 05 Oct, 2024

రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

Share