నాగచైతన్య ఇంకా శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయలేదు. కానీ.. ఇప్పటికే ఆమెకి అక్కినేని కోడలు హోదా వచ్చేసింది. సోమవారం ఏఎన్నార్ అవార్డ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అవార్డ్ గ్రహీత చిరంజీవి, ముఖ్య అతిథి అమితాబ్ బచ్చన్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన చాలామంది సినీ ప్రముఖులు, కొంతమంది రాజకీయ నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు.అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించే బాధ్యతను శోభితకు అప్పగించారు. సుమంత్, సుశాంత్, సుప్రియతో కలిసి శోభిత అతిథుల్ని ఆహ్వానించింది. అంతకంటే ముందు శోభితను టోటల్ అక్కినేని కుటుంబమంతా కలిసి ఆహ్వానించింది. అవార్డ్ ఫంక్షన్ కు హాజరైన శోభితను ముందుగా నాగచైతన్య పలకరించగా.. ఆ తర్వాత నాగార్జున, అమల, సుశాంత్ సాదరంగా ఆహ్వానించారు. అక్కినేని అవార్డ్ గ్రహీత చిరంజీవితో అక్కినేని కుటుంబం మొత్తం గ్రూప్ ఫొటో దిగగా, అందులో కూడా శోభితకు చోటు దక్కింది. ఇలా పెళ్లికి ముందే అక్కినేని కోడలిగా మారిపోయింది.
Share