ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడి పార్థివ దేహాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు ఆదివారం ఉదయం తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ , కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు జరిగిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు కన్నుమూసిన విషయం తెలిసిందే.