Current Date: 27 Jun, 2026

ఒక సీన్ కోసం 95 టేక్స్.. మహేష్‌బాబుపై కోప్పడిన రాజమౌళి!

దర్శకధీరుడు రాజమౌళి 'వారణాసి' షూటింగ్‌లో మహేష్‌ బాబుపై కోప్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అతను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు పనితీరు గురించి మాట్లాడుతూ, ఒక నిర్దిష్ట సన్నివేశం పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం మహేష్ బాబు ఏకంగా 90-95 టేక్స్ తీసుకున్నారని వెల్లడించారు.

ఆ సమయంలో రాజమౌళి కొంత అసహనానికి గురై ఆ రోజు షూటింగ్‌ను నిలిపివేసి ప్యాకప్ కూడా ప్రకటించారని తెలిపారు. అయితే, దీనిని ఒక విమర్శగా కాకుండా, మహేష్ బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేయడం కోసం ఎంతగా శ్రమిస్తారో, ఆయనకున్న పట్టుదల ఎలాంటిదో వివరించే సందర్భంలో పృథ్వీరాజ్ ఈ విషయాన్ని పంచుకున్నారు

ప్రభాస్ గురించి కూడా పృథ్వీరాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "ప్రభాస్‌కు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు, ఆయన కేవలం కెమెరా ముందు నిలబడితే చాలు.. మిగతా వాళ్లంతా తమ నటనతో ఆకట్టుకోవడానికి శ్రమిస్తుంటారు" అని రాజమౌళి తరచూ చెబుతుంటారని పృథ్వీరాజ్ సరదాగా పేర్కొన్నారు.

Share