ఆస్ట్రేలియా-భారత్ మధ్య తొలి టెస్టు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ షమీ గైర్హాజరీలో తుది జట్టు ఎంపిక భారత్‌కు సవాల్‌గా మారింది. వారి స్థానాలను ఎవరితో భర్తీ చేయాలని మేనేజ్మెంట్ తెగ ఆలోచిస్తోంది. మ్యాచ్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై మేనేజ్మెంట్ ఓ అంచనాకు వచ్చేసినట్లు తెలుస్తోంది.పెర్త్ వేదికగా ఈనెల 22 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. యువ ఆల్‌రౌండర్, విశాఖకి చెందిన ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు అతడిని జట్టులోకి తీసుకోవాలని టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే నితీశ్‌కు జట్టు మేనెజ్మెంట్ ఇప్పటికే సమాచారం ఇచ్చిందట. శుభ్‌మన్ గిల్ దూరమవడం నితీశ్‌కు కలిసొచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పేస్ బౌలర్‌గానూ నితీశ్ ఉపయోగకరంగా ఉంటాడు. ఇటీవల అతడి ఫామ్ కూడా బాగుంది. ఈ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ అతడివైపు మొగ్గుచూపింది.
Share