హీరో ధనుష్, హీరోయిన్ నయనతార మధ్య వివాదం తారాస్థాయికి చేరిపోయింది. నయనతార తన లైఫ్-కెరీర్‌కి సంబంధించిన డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో సోమవారం నుంచి స్ట్రీమింగ్కి వచ్చింది. దీన్ని అడ్డుకునేందుకు ధనుష్ ప్రయత్నిస్తున్నాడని ఓపెన్ లెటర్‌తో నయనతార శాపనార్థాలు పెట్టింది. అసలు వీళ్లిద్దరి మధ్య సంబంధాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? ధనుష్-నయన్ మధ్య గొడవలు చెలరేగడానికి అసలు కారణం ఏంటి? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. పదేళ్ల కిందట ధనుష్ నిర్మాతగా నయనతార ‘నేనూ రౌడీనే’ సినిమా చేసింది. విజయ్ సేతుపతి హీరో. దానికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఆ టైమ్ లోనే నయన్-విఘ్నేష్ దగ్గరయ్యారు. సెట్స్‌లోనే ప్రేమించుకున్నారు.. ఇది ధనుష్‌కు నచ్చలేదు. కట్ చేస్తే.. ‘నేనూ రౌడీనే’ సినిమా హిట్.. నటనకు గాను నయనతారకు ఉత్తమ నటిగా అవార్డ్ వచ్చింది. అదే అవార్డ్ ఫంక్షన్ కు ధనుష్ కూడా వచ్చాడు. నిండు సభలో వేదికపై ధనుష్ ఇగో హర్ట్ అయ్యేలా నయనతార మాట్లాడింది. తన యాక్టింగ్, నిర్మాతకు నచ్చలేదని, నెక్ట్స్ టైమ్ బాగా నటిస్తానంటూ ఓ చేతిలో అవార్డ్ పట్టుకొని, ధనుష్ పై పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇలా ధనుష్, నయన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Share