ఢిల్లీలో స్టేజ్-4 ఆంక్షలు...ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం
Nov 18, 2024
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ – 4 కింద మరిన్ని నిబంధనలను ఈ రోజు నుండి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ రాత్రి 7 గంటల సమయానికి 457కి పెరుగుతోంది. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్‌లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం అతిశీ ప్రకటించారు.