Current Date: 18 Nov, 2024

వైసీపీ ఎమ్మెల్యేలకు అనిత మాస్ వార్నింగ్...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. శాసన మండలిలో మహిళలపై అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల్లో క్రైమ్ రేటు తగ్గిందని మంత్రి అనిత అన్నారు.మహిళలపై దాడులు, హత్యలు, అత్యారాలు పెరిగిపోయాయని వరుదు కల్యాణి ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని కల్పలతా రెడ్డి ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనలో అనేక లోపాలున్నాయని మంత్రి అనిత తెలిపారు. దిశ చట్టం లేదు. నిర్భయ చట్టం ఉంది. నిర్భయ కింద కేసులు నమోదు చేయలేదని అన్నారు.

Share