Current Date: 18 Nov, 2024

తణుకు సంతలో మద్యం అమ్మకం చంద్రబాబుపై రోజా సెటైర్

ఏపీలో నూతన మద్యం పాలసీ రాగానే అక్రమ మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లోకి రాగా.. పలు గ్రామాల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే బహిరంగంగానే బెల్టు షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.తణుకులో తాజాగా సంత మార్కెట్‌లో మద్యం అమ్ముతున్న షేక్ మున్నా, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్య అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 60 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ మణికంఠరెడ్డి తెలిపారు. సంతలో మద్యం అమ్మకాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటుగా విమర్శించారు.‘‘జగనన్న విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే.. చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ఈ వీడియో చూడండి.. ఇది చంద్రబాబు కి ఓటేసిన ఆంధ్రప్రదేశ్‌లోనే  ఇది జరిగింది. తణుకులో ఇలా విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు వెలిశాయి. టీడీపీ నేతలే మద్యం షాపులు, బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు.

 

 

Share