Current Date: 18 Nov, 2024

చంద్రబాబు తమ్ముడు రాజకీయాలకి దూరమయ్యారిలా.. చిన్న తప్పిదం!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయానా తమ్ముడైన రామ్మూర్తి నాయుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఇద్దరూ ఒకే ఇంటి నుండి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ కాలక్రమంలో అన్నాదమ్ముళ్ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2003 డిసెంబర్ 8న రామ్మూర్తి నాయుడు వెళ్లి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని చెబుతుంటారు అప్పటి పరిణామాలను దగ్గరిగా చూసిన రాజకీయ పరిశీలకులు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుండి కాంగ్రెస్ టికెట్ ఇస్తారనే హామీతోనే రామ్మూర్తి నాయుడు ఆ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. కానీ అప్పటికే ఆ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గల్లా అరుణ కుమారికి ఇస్తానని వైఎస్ఆర్ మాటిచ్చేశారు. దాంతో  రామ్మూర్తి నాయుడుకి నిరాశ తప్పలేదు. వాస్తవానికి అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగిన మరుసటి రోజే అన్న చంద్రబాబు సైడ్ వచ్చేయమని చిన్న కొడుకు రామ్మూర్తి నాయుడుకు వారి తల్లి చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత వారి మధ్య విబేధాలు దూరమవడం, రామ్మూర్తి నాయుడు తిరిగి టీడీపీలో చేరడం జరిగింది. 

Share