Current Date: 21 Mar, 2025

మంచు బ్రదర్స్ మళ్లీ ఫైట్.. ఒకే రోజు ఇద్దరూ రెడీ!

మంచు బ్రదర్స్ కొద్దిరోజులుగా కాస్త సైలెంట్ అయ్యార‌నుకుంటే.. ఇప్పుడు మ‌ళ్లీ ఫైట్‌కు దిగుతున్నారు. అయితే ఈసారి బాహాబాహీ కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మంచు విష్ణు తాను నటిస్తూ.. నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్పను ఏప్రిల్ 25న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. మంచు మనోజ్ కూడా తాను నటించిన భైరవం‌ సినిమాను కూడా ఏప్రిల్ 25నే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కన్నప్పపై మంచు మనోజ్ సెటైర్లు వేస్తూ.. కోట్లు ఖర్చు పెడితే సినిమా ఆడదంటూ ఎగతాళి చేశాడు. మరి ఏప్రిల్ 25న థియేటర్లలో మంచు సోదరుల మధ్య క్లాష్ ఎలా ఉంటుందో చూడాలి.. బైరవం మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కలసి నటిస్తున్నారు. వరుస ప్లాప్ లతో ఉన్న ఈ ముగ్గురు సినిమాలు సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు పరిస్థితి కూడా ఇలానే ఉంది.

Share