తానా ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సమావేశాలకు రావాలంటూ ఆయనను ఆహ్వానించారు. ఈ ఏడాది తానా సభలు జులై 3 నుంచి 5వ తేదీ వరకు అమెరికాలోని డెట్రాయిట్ లో నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో తానా చైర్మన్ గంగాధర్ నాదెళ్ల, తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా, తానా మాజీ అధ్యక్షుడు జయరామం కోమటి తదితరులు ఉన్నారు. వారు చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేశారు.