అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల - ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ “పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. పిల్లలకు చదువులు చెప్పడం ఒక్కటే టీచర్స్ బాధ్యత కాకుండా వారి వ్యవహర శైలిని కూడా పరిశీలించాలి. పిల్లలు గంజాయికి విపరీతంగా బానిసలు అవుతున్నారు. పిల్లలను తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు నిరంతరం పరిశీలించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తే, పిల్లలకు బాధ్యత ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల నైతికవిలువలపై దృష్టి సారించండని అనిత కీలక సూచనలు చేశారు.
Share