Current Date: 12 Mar, 2025

చంద్రబాబు తిన్న ప్లేట్ ను తీసిన నారా లోకేశ్...

ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులిద్దరూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం పూర్తయిన తర్వాత చంద్రబాబు తిన్న ప్లేట్ ను నారా లోకేశ్ తీయడం అందరి దృష్టిని ఆకర్షించింది. తల్లిదండ్రుల పట్ల తనకున్న అత్యంత గౌరవాన్ని చాటి చెప్పడమే కాదు, నిత్యం మనకు సహాయకారిగా ఉండే వారి పట్ల ఎంతటి విధేయతను కలిగి ఉన్నారో దీని  ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా  ఇది అందరికీ స్ఫూర్తిదాయకం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమనే దానికి ఇది నిదర్శనం.

Share