Current Date: 20 Mar, 2025

ఘనంగా జరిగిన నాగ‌చైత‌న్య‌-శోభితల పెళ్లి...

కింగ్ అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి బాజా మోగింది. నాగచైతన్య, శోభిత ల వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో హిందూ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో శోభిత మెడ‌లో చైత‌న్య మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి, సుహాసిని, కీరవాణి తదితరులు హాజ‌ర‌య్యారు.

Share