పవన్ మాట సినిమా టైటిల్‌గా.. సీజ్ ది షిప్ పేరుతో టైటిల్ రిజిస్టర్...
Dec 05, 2024
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నౌకను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఆ క్రమంలో ఆయన చేసిన 'సీజ్ ద షిప్' వ్యాఖ్యలు నెట్టింట బాగా ప్రచారం అయింది. ఇప్పుడు ఏకంగా అవే వ్యాఖ్యలతో సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ అనే సంస్థ సోమవారం ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకుంది.