మహా రాజకీయంలో సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానో లేదనన్న ఏక్‌నాథ్ షిండే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. నేడు మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌తో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత వారం రోజులుగా ఉత్కంఠకు తెరదించుతూ మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ పదవిని అంగీకరించారు. ఇద్దరు డిప్యూటీల్లో ఒకరిగా షిండే, మరొకరు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.