తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా 'యానిమల్' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయారు. ఇదిలాఉంటే.. సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ నటించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ ప్రకటన తాలూకు వీడియో అది. వీడియోలో 'యానిమల్' సినిమాలో హీరో రణబీర్ క్యారెక్టర్‌లో ధోనీ సైకిల్‌పై రావడాన్ని సందీప్‌రెడ్డి చిత్రీకరించడం మనం చూడొచ్చు. కాగా, ఈ యాడ్‌కు సంబంధించిన పూర్తి వీడియో త్వరలోనే బయటకు రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమోలే సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.