Current Date: 19 Mar, 2025

విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ ...

విశాఖ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి గెలుపొందిన అనేక మంది ప్రజా ప్రతినిధులు ఆ పార్టీని వీడి కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి కూటమి చెంతకు చేరగా, మరో 9 మంది కార్పొరేటర్‌లు నేడు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. చల్లా రజని, గేదెల లావణ్య, సునీత, భూపతిరాజు సుజాత, ముర్రు వాణితో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఈరోజు అమరావతికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 29 మంది మాత్రమే కార్పొరేటర్లుగా గెలవగా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి 11 మంది నేరుగా టీడీపీలో చేరారు.

Share