Current Date: 18 Mar, 2025

ధాన్యానికి 24 గంటలు లోగా నగదు చెల్లింపులు. *పౌరసరఫరాలు ఎండి మనజీర్ జిలానీ.

రైతులకు దాన్యం నగదు 24 గంటలు లోగా అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మేనేజింగ్ డైరక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. బుధవారం సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లాలో దాన్యం కొనుగోలు పై క్షేత్ర స్థాయి పరిశీలన చేసారు. సీతానగరం రైతుసేవా కేంద్రంను తనిఖీ చేశారు.ధాన్యం కొనుగోలు పై ఆరాతీసారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న తాన్నసీతారాం పురం గ్రామానికి చెందిన రైతు మార్రాపు శ్రీరాములు ను ధాన్యం నగదు 24గంటలు లోగా అందుతున్నాయా? అని ఆరాతీశారు. ఈ సందర్బంగా రైతు తన మోబైల్ మెసేజ్ చూపించి అందుతున్నాయని చెప్పారు. ఈ సందర్బంగా మనజీర్ జిలనీ సమూన్ మాట్లాడుతూ ఈ ఏడాది ఎన్డిఏ కూటమి ప్రభుత్వం లో రైతులకు ఎటువంటి యిబ్బందులు లేవన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు గాని రైస్ మిల్లర్లు గానీ రైతులు నుంచి అదనంగా ఒక్క కేజీ ధాన్యం తీసుకోవడం లేదన్నారు. రైతులకు ఎటువంటి యిబ్బందులు లేకుండా చివరి ధాన్యపు గింజవరకు కొనుగోలు చేసి నగదు చెల్లింపులు జరుపుతామని అన్నారు.

Share