Current Date: 15 Mar, 2025

పవన్ స్పీచ్‌కి చిరంజీవి ఫిదా.. ప్రశంసిస్తూ పోస్ట్

పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి కాకినాడలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో చేసిన ప్రసంగంపై చిరంజీవి ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘మై డియర్‌ బ్రదర్‌ పవన్‌ కల్యాణ్‌.. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్‌కు మంత్రముగ్ధుడినయ్యాను. సభకొచ్చిన అశేష జనసంద్రంలానే నా మనసు కూడా ఉప్పొగింది.ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజాసంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.పదకొండేళ్ల జనసేన ప్రస్థానాన్ని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీని ఎలా నిలబెట్టిందీ పవన్ కళ్యాణ్ వివరించారు. తాను చిన్నతనంలో ఎంతో గారాబంగా పెరిగినట్లు తెలిపారు.

Share