నటి సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో చాలా పాపులర్. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న సుప్రీత ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. దీనికి కారణం ఆమె బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడమే.తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈ యాప్స్ బారిన పడి ఆస్తులు కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలు సైతం తీసుకున్నారు. దాంతో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాళ్లని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే లోకల్ బాయ్ నాని అనే ఇన్ ఫ్లూయన్సర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇంటర్నేషనల్ బైక్ రైడర్ బన్నీ సన్నీ యాదవ్ పై కూడా సూర్యాపేట జిల్లా నూతన్ కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సుప్రీత కూడా తన అరెస్ట్ తప్పదని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. దాంతో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అయినప్పటికీ ఆమె అరెస్ట్ తప్పదని వార్తలు వస్తున్నాయి.
Share