గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన చేసింది. పాట్ కమిన్స్ నాయకత్వంలో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. సంచలన విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఆఖరి మెట్టు పై బోల్తాపడింది. ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలవాలని అటు సన్‌రైజర్స్ జట్టు, ఇటు అభిమానులు కోరుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ తలనొప్పిగా మారినట్లుగా తెలుస్తోంది. అతడిని ఎక్కడ ఆడించాలనే విషయం పై ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. ఇక మూడో స్థానంలో 11 సందర్భాల్లో వచ్చాడు. అయితే.. ఈ స్థానంలో అతడు పెద్దగా రాణించలేదు. 19 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇక నాలుగో స్థానంలో 22 సగటుతో 583 పరుగులు చేశాడు. ఐదు, ఆరో స్థానాల్లో ఒక్కొ సారి బ్యాటింగ్ చేసిన ఇషాన్ అక్కడ పెద్దగా రాణించలేదు.
Share