Current Date: 16 Nov, 2024

టీమిండియాలో విభేదాలు

భారత క్రికెట్ జట్టులో విభేదాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-3 తేడాతో ఓటమి పాలవ్వడంపై బీసీసీఐ శుక్రవారం నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ఈ విషయం బయటపడినట్టు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ పాల్గొన్నారు. అయితే కెప్టెన్, కోచ్, చీఫ్ సెలక్టర్ మధ్య ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. గంభీర్‌ నిర్ణయాల పట్ల రోహిత్, అజిత్ అగార్కర్ విభేదిస్తున్నట్టుగా ఈ సమీక్షలో బయటపడింది. దాదాపు 6 గంటలపాటు కొనసాగిన ఈ సమీక్షలో అనేక అంశాలపై చర్చించగా.. జట్టుకు సంబంధించిన కొన్ని నిర్ణయాల విషయంలో గంభీర్‌తో రోహిత్, ఇతర అనుభవజ్ఞులు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్టు బయటపడిందని పీటీఐ పేర్కొంది.

Share