భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. నవంబర్ 22 నుంచి జరగనున్న ఈ సిరీస్‌కు ముందు కలవరపరిచే సంకేతాలు వెలువడ్డాయి. కొన్ని వారాలుగా ఆస్ట్రేలియాలోనే ఉన్న భారత్-ఏ జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం పెర్త్‌లోని వాకా మైదానం వేదికగా శుక్రవారం ఉదయం ఈ మ్యాచ్ మొదలైంది. అభిమానులను అనుమతించకుండా నిర్వహిస్తున్న ఈ వార్మప్ మ్యాచ్‌లో జూనియర్ల ముందు సీనియర్ బ్యాటర్లు తేలిపోతున్నారు. ముఖ్యంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. ఒక బ్యూటిపుల్ కవర్ డ్రైవ్ ఆడి ఆకట్టుకున్న విరాట్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఔట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో రెండవ స్లిప్‌లో ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 15 పరుగులు మాత్రమే చేశాడు. ఔటైన వెంటనే నెట్స్‌లోకి వెళ్లి విరాట్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు.
Share