Current Date: 15 Nov, 2024

డిసిఎంఎస్‌లో స‌హ‌కార వారోత్స‌వాలు... స‌హ‌కార సంఘాల బ‌లోపేతానికి కృషి

జిల్లా స‌హ‌కార మార్కెటింగ్ సంఘం లో 71వ అఖిల‌భార‌త స‌హ‌కార వారోత్స‌వాలు శుక్ర‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. స‌హ‌కార ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమానికి జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకు సిఈఓ సిహెచ్‌.ఉమామ‌హేశ్వ‌ర్రావు, ఐసిఎం రాష్ట్ర స‌మ‌న్వ‌యాధికారి శ్రీ‌నివాస్, ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కోప‌రేటివ్ ఆడిట్ అధికారి బి.స‌న్యాసినాయుడు, అసిస్టెంట్ రిజిష్ట్రార్‌, డిసిఎంఎస్ బిజినెస్ మేనేజ‌ర్ బివిఎస్ సాయికుమార్‌, ఇత‌ర అధికారులు పాల్గొని ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా డిసిఓ ర‌మేష్ మాట్లాడుతూ, ప్ర‌తీ ఏటా న‌వంబ‌రు 14 నుంచి వారం రోజుల‌పాటు స‌హ‌కార వారోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. 1904లో దేశంలో ఏర్పాటైన స‌హ‌కార వ్య‌వ‌స్థ రోజురోజుకూ బ‌లోపేతం అవుతోంద‌ని అన్నారు. పారిశ్రామిక రంగంలో కూడా స‌హ‌కార సంఘాల ప్రాధాన్య‌త‌ను పెంచేందుకు తాజాగా ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఎరువుల‌ త‌యారీ, పాలు ఉత్ప‌త్తిలో స‌హ‌కార సంఘాలు గ‌ణ‌నీయ‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయ‌ని తెలిపారు. 

Share