శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మందస మండలం సువర్ణ పురం గ్రామ శివాలయంలో తెల్లవారుజామున ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి.కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున కుటుంబ సమేతంగా శివుని దర్శనం చేసుకోడానికి వచ్చినట్లు తల్లి ఎలుగుబంటి రెండు పిల్ల ఎలుగుబంట్లు శివాలయానికి వచ్చాయి. శివాలయానికి వెళ్ళిన భక్తులు ఎలుగుబంట్లను చూసి పరుగులు పెట్టారు. తీవ్ర భయాందోళనలు చెందారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు గ్రామస్తులు. వాటికి ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని అటవీ శాఖ సిబ్బంది సూచించారు. ఆలయంలోనే ఎలుగుబంట్లు తిష్ట వేయటంతో స్థానికులు కేకలు వేస్తూ ఎలుగుబంట్లును ఆలయం నుండి బయటకు తరిమి వేసారు. ఎలుగుబంట్లు సంచారoపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవటం లేదనీ గరమస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Share