Current Date: 15 Nov, 2024

బలహీనపడిన అల్పపీడనం.. నేడు 18 జిల్లాలకు అలెర్ట్‌

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. అయినప్పటికీ ఉత్తర తమిళనాడు కోస్తా తీరం నైరుతి బంగాళాఖాతంలో చెన్నైకి సమీపంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఈ కారణంగా తిరువళ్లూరు, వేలూరు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ లో వర్షాలు కురుస్తాయని వాతావారణ కేంద్రం తెలిపింది. కేరళ సముద్రతీర ప్రాంతానికి సమీపంలో ఆగ్నేయ అరేబియా సముద్రంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌ లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ రోజు 18 జిలాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 16వ తేదీన నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, తేని, దిండిగల్‌ జిల్లాల సహా చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు.

Share