Current Date: 26 Mar, 2025

ఐపీఎల్‌లో 12 ఏళ్ల ముంబయి సెంటిమెంట్ రిపీట్.. ఫ్యాన్ హ్యాపీ

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయ్యింది. గత 12 ఏళ్లుగా ప్రతి సీజన్‌లోనూ తాను ఆడే తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓడిపోవడం ఓ ఆనవాయితీగా వస్తోంది. 2013 నుంచి ప్రతీ సీజన్‌లో ఇలా జరుగుతోంది. 2025 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబయి ఇండియన్స్ ఓడిపోయి ఆ సెంటిమెంట్‌ను కొనసాగించింది. కానీ.. ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. 2013 నుంచి ఇలా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతున్నా.. అనూహ్యంగా 5 సార్లు ఆ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది.ముంబయి ఫ్యాన్స్ ఆ టీమ్ ఓటమి పట్ల ఫీల్ అవ్వట్లేదు.. సెంటిమెంట్ రిపీట్.. మళ్లీ మాదే కప్ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. హార్దిక్ పాండ్య కెప్టెన్ అయ్యాడు. కానీ.. మ్యాచ్ నిషేధం కారణంగా చెన్నై మ్యాచ్‌‌కి సూర్యకుమార్ కెప్టెన్‌గా వ్యవరించాడు.

Share