ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు డీలిమిటేషన్‌పై స్పందించారు. తమిళనాడుకు చెందిన తంతి టీవీ ఛానెల్‌కుప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. డీలిమిటేషన్‌పై మొదట పార్లమెంటులో మాట్లాడాలని, తర్వాత పోరాడాలని అన్నారు. అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్‌లో ఇప్పుడు భిన్న వైఖరి కనిపిస్తోంది. డీలిమిటేషన్ పట్ల తమ అభిప్రాయాలు, భయాలు వినిపించేందుకు జేఏసీగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఇతర రాష్ట్రాల నేతలను కూడగడుతున్నారు. ఇది కేవలం అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం అని.. అలాంటి భేటీని కూడా ఇంటర్వ్యూలో పవన్ విమర్శించారు.వాస్తవానికి డీలిమిటేషన్ వంటి సీరియస్ అంశం తెరమీదకు వచ్చినప్పుడు.. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తెలుసుకుని ఉండాల్సింది. కానీ.. బీజేపీ దాన్ని విస్మరించింది. అయినా.. పవన్ వంతపాడుతున్నారు.
Share