తాజాగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎగిరిగంతేసే వార్త ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఐపీఎల్లో బెంగళూరు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి మరోసారి జట్టుకు సారథ్యం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2025 ఆర్సీబీ కెప్టెన్‌గా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆర్సీబీ యాజమాన్యాన్ని విరాట్ కోరినట్లు పేర్కొంది. కోహ్లి వరుసగా 9 సీజన్లలో ఆర్ సి బి కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఒక్క టైటిల్ కూడా గెలువకపోవడంతో 2021 సీజన్ తర్వాత కెప్టెన్‌గా తనే రాజీనామా చేశాడు. అప్పటి నుండి ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా మూడు సీజన్లలో జట్టు బాధ్యతలు చేపట్టాడు. వచ్చే సీజన్లో డుప్లెసిస్‌ను బెంగళూరు కొనసాగించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మెగా వేలం ద్వారా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్లలో ఒకరిని జట్టుకు కెప్టెన్‌గా చేయాలని ఆర్ సి బి ప్రయత్నిస్తుందని మరో వాదన వినిపిస్తుంది.
Share