విశాఖపట్నం ఎయిర్‌పోర్టును శనివారం ఉదయం మంచు పూర్తిగా కమ్మేసింది. ఫ్లైట్ ల్యాండిరగ్ నిబంధన ప్రకారం కావాల్సినంత వెలుతురు లేకపోవడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది పలు విమానాలను దారి మళ్లించారు. ఢల్లీి-విశాఖపట్నం విమానాన్ని భువనేశ్వర్ వైపు, హైదరాబాద్ -విశాఖపట్నం, బెంగళూరు- విశాఖపట్నం విమానాలను హైదారాబాద్ వైపు మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.