తాజాగా, లోవరాజు డ్యాన్స్ వీడియో మంత్రి లోకేశ్ దృష్టిలో పడడంతో ఆయన మెచ్చుకున్నారు. ‘సూపర్‌గా డ్యాన్స్ చేశారు బ్రదర్ కీపిట్ అప్’ అని ఎక్స్ ద్వారా ప్రశంసించారు. లోకేశ్ ట్వీట్‌కు డాక్ట్ మహిష్మ.కే అనే ఎక్స్ యూజర్ స్పందిస్తూ.. మీరు ట్వీట్ చేయకముందే ఈ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారట అన్నా.. దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోండి అని కోరాడు. క్రమశిక్షణ, సమయ పాలన ముఖ్యమే కానీ, హాని చేయని వినోదం నేరం కాదని పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న లోకేశ్ ఈ పోస్టు చూసిన వెంటనే స్పందించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేస్తారని, వెంటనే అతడిని ఉద్యోగంలోకి తీసుకుంటారని, తాను వచ్చిన వెంటనే వీలు చూసుకుని లోవరాజును కలుస్తానని మరో పోస్టు చేశారు. లోకేశ్ పోస్టుతో లోవరాజును అధికారులు మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు.
Share