అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో పాటు కాంగ్రెస్ సభ్యులు, అధికారులతో సహా 600 మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా బైడెన్ మాట్లాడుతూ.. దక్షిణాసియా అమెరికన్ సమాజాన్ని కొనియాడారు. తన పరిపాలనలో దక్షిణాసియా అమెరికన్లు పోషించిన కీలక పాత్రను బైడెన్ ప్రస్తావించారు. వైట్ హౌస్ లోని బ్లూ రూమ్ లో బైడెన్ దీపం వెలిగించారు. దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీ అమెరికా అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, దేశం అభివృద్ధిలో అత్యంత నిమగ్నమై ఉన్న కమ్యూనిటీల్లో మీరూ ఉన్నారని బైడెన్ కొనియాడారు.
Share