Current Date: 20 Mar, 2025

ప్రతి జిల్లాలో క్రీడా స్టేడియం...స్పీకర్‌ అయ్యన్న...

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రజాప్రతినిధు ల క్రీడా పోటీలు  ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పోటీలను అయ్య న్న పాత్రుడు ప్రారంభించారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా క్రీడలు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎంతోమంది మంచి క్రీడాకారులున్నారు. క్రీడలకు పూర్వవైభవం తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాలో స్టేడియంలు నిర్మించి క్రీడలకు పూర్వవైభవం తీసుకొస్తాం’ అని స్పీకర్‌ అన్నారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయాలి. క్రీడాకారులను ప్రోత్సహించాలి. అందుకు ప్రతి జిల్లాలో స్టేడియంలు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించాం’ అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

Share