ఆర్జీవీ కాంపౌండ్ నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది సోనియా ఆకుల. ఆర్జీవీ ప్రొడక్షన్ లో ఆశ, కరోనా లాంటి పలు సినిమాలు, బయట కూడా అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. బిగ్ బాస్ 8 లోకి నటి సోనియా వచ్చి నాలుగు వారాలకే ఎలిమినేట్ అయింది. నటిగానే కాకుండా ఓ టూరిజం సంస్థలో పనిచేస్తుంది, ఓ ఎన్జీవో కూడా నడిపిస్తుంది. అయితే నాగార్జున గురించి, బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ భామ సోనియా ఆకుల మాట్లాడుతూ..నేను 20 సినిమాలు చేసినా రాని గుర్తింపు నాకు బిగ్ బాస్ తో వచ్చింది. ఈసారి అయితే నాగార్జున సర్ హోస్ట్ గా ఉండొద్దు అనుకుంటున్నా. నాగ్ సర్ సాఫ్ట్ గా ఉంటారు. నాగ్ సర్ సరిగా మాట్లాడలేదు, చాలా పదాలు, మాటలు మార్చేశారు. నేను అనని వాటి గురించి కూడా తప్పుగా ప్రమోట్ చేసారు. బిగ్ బాస్ లో హోస్ట్ మేజర్ పాత్ర పోషిస్తారు. ఉన్నది లేనిది కలిపి మాట్లాడకూడదు హోస్ట్. నాగార్జున గారు చెవిలో ఉండే మైక్ లో ఏం చెప్తే అది చెప్తారు. ఆలోచించరు. నాగార్జున సర్ తప్పుకుంటే మంచిది. రానా గారు అయితే హోస్ట్ గా బాగా సరిపోతారు.
Share