పట్టణంలో నాలుగో వార్డు లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలో పెద్ద వీధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు మనం అందరం రిజర్వేషన్లు అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుడు వలనే అన్నారు. ఆయన భారతదేశానికే ఒక స్ఫూర్తి అని కొనియాడారు. నాలుగవ వార్డు ఐదవ వార్డు ప్రజలకి ఏవిధంగా ఉపయోగపడతాను మీరందరూ ఉద్యోగుల విషయంలో గాని ఏ సమస్యలు గాని నా దగ్గరికి వచ్చి పరిష్కరించు కోవచ్చనని ఆమె తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ పి భంజ్ దేవ్ మాట్లాడారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులందరూ పాల్గొన్నారు.
Share