టెంపుల్ సిటీ తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో తిరుపతి నుంచి సింగపూర్‌కు ప్రైవేట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం 5 గంటలకు ఎమ్ ఎస్ లక్స్ ఏవియేషన్ సంస్థకు చెందిన తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు బయలుదేరింది. విదేశీ యాత్రికులు రెండుసార్లు ఫైట్ జర్నీ చేయాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఈ రోజు ఉదయం 5 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు బయలుదేరింది.
Share