శ్రీరాముని పాదుగులు పట్టాభిషేకం సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండ చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు బొబ్బిలి కోటకి విచ్చేసారు. ఈ సందర్భంగా స్వామీజీ వారిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన యువరాజు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుజయ్ కృష్ణ రంగారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి మండలి అధ్యక్షులు మరియు రామ్ నాయన రాజా ఆఫ్ ది బొబ్బిలి సంస్థానీదుశులు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వామీజీ శిష్యులు భక్తులకు తీర్థ గోష్టి అందించారు. ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు బొబ్బిలి కోట నుండి సంస్థాన హైస్కూల్ గ్రౌండ్ లో సమావేశం ఉంటుందని బేబీ నాయన తెలియజేశారు. సాయంకాలం ఐదు గంటల నుంచి కోట నుండి శోభాయాత్రలో స్వామీజీ వారు పాల్గొంటారని, భక్తులందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే బేబీ నాయన తెలియజేశారు.
Share