ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన దాదాపు ఖరారయింది. ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్య ఆయన ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి పనులను ఆయన పునఃప్రారంభించనున్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల విలువైన పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. అమరావతిలో రూ. 40 వేల కోట్ల పనులకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ప్రజాధనంతో అమరావతిని నిర్మించడం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పి.నారాయణ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన ద్వారా అమరావతి నిర్మాణ పనులు వేగవంతమవుతాయని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక అడుగు అని ప్రభుత్వం భావిస్తోంది.
Share