విశాఖలో హోలీ పండగా ఉత్సహంగా జరిగింది. రెయిన్ డ్యాన్స్‌లతో హోరెత్తించారు. శుక్రవారం పలు వీధుల్లో, కాలనీలో యువత హోలీ సంబరాలు జరుపుకుంటూ సందడిగా కనిపించారు. యువత జోరు, హుషారుతో నగరం రంగులమయమైంది. ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా రంగుల లోకంలో విహరించారు. రెయిన్ డ్యాన్సులు, సముద్ర స్నానాలతో ఉల్లాసంగా గడిపారు. ఒకరికొక్కరూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిజం చేస్తూ అన్ని వర్గాల ప్రజలు రంగుల్లో మునిగితేలారు. యువత కేరింతలతో హోలీ సంబరాలు అంబరాన్నింటాయి.