Current Date: 15 Mar, 2025

పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్‌ ప్రయోగం సక్సెస్....

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి చేపట్టిన పియస్ ఎల్ వి - సి  59 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రోబా 3లో రెండు ఉపగ్రహాలున్నాయి. 310 కేజీల బరువుండే కరోనా గ్రాఫ్‌ స్పేస్‌, 240 కేజీల బరువున్న ఓకల్టర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఈ రాకెట్‌లో ఉన్నాయి. ఈ జంట ఉపగ్రహాలు కక్ష్యలో లాబొరేటరీలా పనిచేస్తాయి. ఈ రెండు ఉపగ్రహాలు కలిసి కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టిస్తాయి. ఆ తర్వాత ఆ కృత్రిమ గ్రహణాన్ని అధ్యయనం చేస్తాయి. ఈ జంట ఉపగ్రహాల్లో ఒకటిని సూర్యుడిని కప్పి కృత్రిమ గ్రహణం సృష్టిస్తే.. మరొకటి కరోనాపై విశ్లేషణ చేస్తుంది. ఈ మిషన్‌ను స్పెయిన్‌, పోలాండ్‌, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తల సహకారంతో రూపొందించారు. ఈ ప్రయోగాన్ని ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ సహకారంతో నిర్వహించింది.

Share