సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పనులు వేగవంతం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి, ఫౌంటేన్ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం విజయోత్సవాలను ఘనంగా చేస్తోంది. 9 రోజుల పాటు ఈ వియోత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల చివరి రోజు అంటే ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉండబోతోంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 7,8,9 తేదీలలో పూర్తి సంబరాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూడు రోజులు భారీ కార్యక్రమాలకు నిర్వహించనుంది. తెలంగాణ కళా రూపాలు, వంటకాలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించబోతోంది.
Share