Current Date: 15 Mar, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్...

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆడిలైడ్ వేదికగా ఇవాళ ప్రారంభమైంది. డేనైట్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదిలాఉంటే మొదటి టెస్టుకు దూరమైన రోహిత్, శుభమన్ గిల్ ఈ టెస్టులో ఆడుతున్నారు. మొత్తం మూడు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. పెర్త్ టెస్టులో ఆడిన వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ ఈ టెస్టుకు దూరమయ్యారు. వీరి స్థానంలో రవిచంద్ర అశ్విన్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తుదిజట్టులోకి చేరారు. ఒక్క మార్పుతో ఆసీస్ బరిలోకి దిగింది.

Share