Current Date: 12 Mar, 2025

దుప్పట్లు తయారీ వృద్ధులకు పంపిణీ .. చల్లా మంజుల దాతృత్వం

విశాఖలోని ఎంవీపీ కాలనీకి చెందిన ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ విశ్రాంతి అధికారిణి చల్లా మంజుల దాతృత్వం కనబర్చారు. తన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అచీవ్‌మెంట్‌ను ‘మానవతా మిషన్‌’గా మార్చారు.  మహిళా మనో వికాస్‌ విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా అత్యధిక సంఖ్యలో క్రోచెట్‌ స్క్వేర్‌లను రూపొందించినందుకు ప్రతిష్టాత్మక రికార్డును సాధించిన  ఆమె, చతురస్ర రంగుల దుప్పట్లను అల్లి, చలితో బాధ పడుతున్న వృద్ధులకు ఉచితంగా పంపిణి చేసారు. మా ప్రేమ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో మంజుల ఈ దుప్పట్లను నిరాశ్రయులకు అందజేశారు. మంజుల ప్రయత్నాలు వ్యక్తిగత సాధనకు మించినవని, మానవాళికి సేవ చేయాలనే ఆమె అచంచలమైన నిబద్ధతను ప్రతిబింభిస్తాయని పలువురు ఈ సందర్భంగా కొనియాడారు.

Share