Current Date: 08 Feb, 2026

మహేష్ బాబు వారణాసి ఓటీటీ డీల్‌కి కంపెనీలు క్యూ.. ఎంత రేటు అంటే?

రాజమౌళికి సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారణాసిలో కేవలం రెండు ఫ్లెక్సీలతో దేశవ్యాప్తంగా చర్చ మొదలుపెట్టడం ఆయన మార్కెటింగ్ తెలివితేటలకు నిదర్శనం. సినిమా విడుదల 2027లో (ఏప్రిల్ 7న ఉగాది సందర్భంగా) ఉన్నప్పటికీ, ఇప్పుడే గ్లోబల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వరల్డ్ వైడ్ మార్కెట్‌ను ఆకర్షిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో భారీ డీల్ కుదుర్చుకోవాలనేది టీమ్ లక్ష్యంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో 'వారణాసి' ఓటీటీ రైట్స్ 600 నుండి 650 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, మహేష్ బాబు గ్లోబల్ అప్పీల్ కలిపినా, ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం 350 నుండి 450 కోట్ల మధ్య డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే 650 కోట్లు అనేది కేవలం సోషల్ మీడియా సృష్టించిన హైప్ మాత్రమేనని పరిశ్రమ వర్గాల భోగట్టా. ఈ ప్రాజెక్ట్ దాదాపు 1000 నుండి 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్యాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు కోసం చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అయితే, భారతీయ సినిమా ఓటీటీ మార్కెట్ సరిహద్దులు మారిపోతాయి.